నువ్వు ఎదురైన ప్రతి సారి
నా పెదవులపై ఓ చిరునవ్వు నీకు స్వాగతం పలికేది
నీవు చేరువగా ఉన్నంత సేపు
నీతో మాట కలపాలని మనసు ఆరాటపడేది
నీవు నా సాన్నిహిత్యాన్ని కోరుతున్నావని
నీ కళ్ళు చెబుతున్నా అవ్యక్త భావమేదో నన్ను వెనుకకు లాగేది
నీవు దూరంగా వెళుతుంటే
మనసు పడే వేదనేదో నా కన్నుల్లో ప్రతిఫలించేది
నీతో మాట కలపాలని... నిన్ను స్పర్సించాలని...
వెన్నెల దారుల్లో నీతో కలిసి పయనించాలని ఎన్ని ఆశలో...
నీతో గడిపిన మధుర క్షణాలు
తొలి మోహపు తీపి గురుతులై ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి !
pramod
Sunday, August 29, 2010
Friday, August 13, 2010
నా మౌనం మాట్లాడుతుంది
చెమ్మగిల్లిన కళ్ళతో
బరువెక్కిన హృదయంతో
నిదురించే ఊహలను తట్టి లేపి
మౌనంగానే మాట్లాడుతుంటాను
ఓ మహా స్వప్నికుడిలా ఆ ఊహలకు ఊపిరి పోస్తాను
మౌనం ఓ లిపిలేని భాష
మౌనం ఓ సజీవ దృశ్యం
అందుకే అనుక్షణం ఆ మౌనాన్ని శ్వాశిస్తుంటాను
ప్రతి క్షణం ఆ మౌనంతో మమేకమౌతుంటాను...
బరువెక్కిన హృదయంతో
నిదురించే ఊహలను తట్టి లేపి
మౌనంగానే మాట్లాడుతుంటాను
ఓ మహా స్వప్నికుడిలా ఆ ఊహలకు ఊపిరి పోస్తాను
మౌనం ఓ లిపిలేని భాష
మౌనం ఓ సజీవ దృశ్యం
అందుకే అనుక్షణం ఆ మౌనాన్ని శ్వాశిస్తుంటాను
ప్రతి క్షణం ఆ మౌనంతో మమేకమౌతుంటాను...
నీవు లేని ఆ క్షణాన...
నీవు లేని ఆ క్షణాన...
దిగులు గుహలో జారిపడ్డ
ఒంటరి జ్ఞాపకాన్నై మెదిలాను
నీవు లేని ఆ క్షణాన...
శ్వాసించని వేణువులా
మౌన గీతికనయ్యాను
నీవిక రావని తెలిసిన క్షణాన
నీవు నడచిన దారిలోనే గడ్డి పువ్వునై మిగిలాను !
దిగులు గుహలో జారిపడ్డ
ఒంటరి జ్ఞాపకాన్నై మెదిలాను
నీవు లేని ఆ క్షణాన...
శ్వాసించని వేణువులా
మౌన గీతికనయ్యాను
నీవిక రావని తెలిసిన క్షణాన
నీవు నడచిన దారిలోనే గడ్డి పువ్వునై మిగిలాను !
Subscribe to:
Posts (Atom)