Friday, August 13, 2010

నీవు లేని ఆ క్షణాన...

నీవు లేని ఆ క్షణాన...
దిగులు గుహలో జారిపడ్డ
ఒంటరి జ్ఞాపకాన్నై మెదిలాను
నీవు లేని ఆ క్షణాన...
శ్వాసించని వేణువులా
మౌన గీతికనయ్యాను
నీవిక రావని తెలిసిన క్షణాన
నీవు నడచిన దారిలోనే గడ్డి పువ్వునై మిగిలాను !

No comments:

Post a Comment