నువ్వు ఎదురైన ప్రతి సారి
నా పెదవులపై ఓ చిరునవ్వు నీకు స్వాగతం పలికేది
నీవు చేరువగా ఉన్నంత సేపు
నీతో మాట కలపాలని మనసు ఆరాటపడేది
నీవు నా సాన్నిహిత్యాన్ని కోరుతున్నావని
నీ కళ్ళు చెబుతున్నా అవ్యక్త భావమేదో నన్ను వెనుకకు లాగేది
నీవు దూరంగా వెళుతుంటే
మనసు పడే వేదనేదో నా కన్నుల్లో ప్రతిఫలించేది
నీతో మాట కలపాలని... నిన్ను స్పర్సించాలని...
వెన్నెల దారుల్లో నీతో కలిసి పయనించాలని ఎన్ని ఆశలో...
నీతో గడిపిన మధుర క్షణాలు
తొలి మోహపు తీపి గురుతులై ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి !
No comments:
Post a Comment